ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం: ఆరె యాదగిరి గౌడ్

400பார்த்தது
ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం: ఆరె యాదగిరి గౌడ్
అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఇల్లు లేని ప్రతి పేద ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని చెప్పి. అధికారంలోకి ఆరు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరె యాదగిరి గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సొంత జాగా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని గొప్పలు చెప్పారని కానీ ఇవి ఏమి ఇవ్వకుండా నియోజకవర్గంలో మాత్రం పార్టీ ఆఫీస్ భవనాలకు గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంత కన్న విడ్డురం ఎమన్నా ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజానీకానికి డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వని పక్షంలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி