యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం తల్లి దండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చూసి చలించిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజక వర్గ ఇంఛార్జి బీర్ల అయిలయ్య, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు కీ.శే లు గట్టు అనురాధ-సత్తయ్య ల పిల్లల చదువుల కోసం, వారి పెరుగుదలకు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, శ్రీశైలం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మా రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జన్నాయికోడే నగేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.