తల్లి మృతి చెందింది, తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కనీసం తినడానికి కూడా లేకపోవడంతో చుట్టుపక్కల వారు వారికి ఏవిధంగా నైనా సహాయం అందాలని వారి ఫోటోలను సోషల్ మీడియాలో సహాయం కోసం అర్ధించారు. అది తెలుసుకున్న ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య స్పందించి శనివారం ఉదయాన్ని వారి సందర్శించి తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన నందిని రాజు ఇద్దరు దంపతులు వారి సంసారం సాఫీగా సాగుతుంది. చక్కనైన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతలోనే అనారోగ్యంతో హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నందిని మృతి చెందింది. అప్పటినుండి రాజు ఆరోగ్యం కూడా క్షీణించింది. మెరుగైన వైద్యం చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితి తినడానికి కూడా లేని కుటుంబం కావడంతో చేసేది ఏమి లేక ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలు పోషించాలేని స్థితిలో తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పిల్లలు ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన స్థానికులు వారికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా ఫోస్టులు చేయడం జరిగింది. స్పందించిన ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.