WPLలో భాగంగా బెంగళూరు వేదికగా జరుగుతున్న యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరుజట్లు 180 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ వచ్చింది. WPL చరిత్రలోనే ఇది తొలి సూపర్ ఓవర్. తొలుత బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో బెంగళూరు 180/5 చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన యూపీ జట్టు 180 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.