2018లో IMFలో చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా ‘గీతా గోపినాథ్’ గుర్తింపు పొందింది. హార్వర్డ్‌లోని ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో IMF జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ 25 ఆర్థికవేత్తలలో కూడా గీత ఒకరు. ఆమెకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ కూడా లభించింది.