ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసినట్టుగా రోజుకు 2 గ్రాముల కంటే తక్కువ 'సోడియం' తీసుకుంటే 10 ఏళ్లలో హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ద్వారా సంభవించే మరణాన్ని నివారించవచ్చని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అనే ఓ కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అలవాటు గణనీయమైన వైద్య ఖర్చులను కూడా తగ్గిస్తుంది. అంటే రోజుకు ఒక టీస్పూన్ (2-5 గ్రాములు) కంటే తక్కువగా ఉప్పు తీసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తుంది.