నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీంమిండియా బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు ఆయన తన గదికి వచ్చారని భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. '3వ స్థానంలో తాను ఆడతానని తిలక్ నా రూమ్ కి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు. అతడిపై విశ్వాసంతో సరేనన్నాను. ఆ నమ్మకాన్ని సెంచరీతో నిలబెట్టుకున్నారు' అని కొనియాడారు. గత మ్యాచ్లో సూర్య వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చారు.