మరో రెండు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగా.. శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో భారీగా బంగారం, నగదు చోరీకి గురైంది. ఈ సంఘటన హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 17న ఆదివారం పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ, మెహందీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో 1.33 కిలోల బంగారు ఆభరణాలు, 800 గ్రాముల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.