తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొని ప్రసంగించారు. దళితులకు, గిరిజనులకు కూడా అవకాశం ఇవ్వాలని ఎన్నారైలు రేవంత్‌రెడ్డిని కోరారు. అలాగే సీతక్కని డిప్యుటీ సీఎం చేయాలని అడిగారు. దీంతో రేవంత్ స్పందిస్తూ.. ఎన్నారైలు అడిగిన ప్రశ్నకి మా పార్టీలో డిప్యుటీ సీఎం ఏంటి? అవసరమైతే సీతక్కని సీఎం చేస్తామని బదులిచ్చారు.