'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. 'సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాం. ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫిల్మ్. వెంకటేశ్ అదరగొట్టారు. నా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస బ్లాక్ బస్టర్లు కొట్టడం గర్వంగా ఉంది. హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి నటన అదుర్స్. బుల్లి రాజు క్యారెక్టర్ అదిరిపోయింది. చిత్రయూనిట్ కు అభినందనలు' అని మహేశ్ ట్వీట్ చేశారు.