'వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’ అనే యాడ్ లో కనిపించిన పాప నిర్మా వాషింగ్ పౌడర్ ను స్థాపించిన యజమాని కర్సన్‌భాయ్ పటేల్ కూతురు. ఆ పాప పేరు నిరుపమ, అందరూ ప్రేమగా నిర్మా అని పిలిచేవారు. అయితే ఓ రోజు నిరుపమ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూతురు జ్ఞాపకార్థం కర్సన్‌భాయ్ తన డిటర్జెంట్‌కు నిర్మా అని పేరు పెట్టారు.