పర్వతగిరి మండలకేంద్రంలో శనివారం, ఆదివారం రోజులలో అన్ని గ్రామాల పోలింగ్ కేంద్రంలలో ప్రత్యేక ఓటర్ నమోదు, సవరణల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తహశీల్దార్ వెంకటస్వామి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు ఫారం 6, 7, 8 దరఖాస్తులతో అందుబాటులో ఉంటారని, 2025 జనవరి 1 వరకు 18 ఏళ్ళు పూర్తయిన యువతీ, యువకులు, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.