మడికొండ రైతుల నుంచి భూములను కొనుగోలు చేసిన ప్రభుత్వం 2013లో మడికొండ, రాంపూర్ గ్రామాల మధ్య ఎతైన ప్రదేశంలో 34 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. డంపింగ్ యార్డులో బయోమైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా సగం కూడా పూర్తి కాలేదు. 4 లక్షల టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.