వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం కలెక్టర్ సత్యశారదా దేవి అధ్యక్షతన ఇసుక సమస్యల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యరాణి, జడ్పీ సీవో, ఇరిగేషన్, రెవిన్యూ, పంచాయతీ రాజ్, మైనింగ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.