వరంగల్ డిఎం హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతలో గురువారం వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు, సవరించిన సార్వత్రిక ఇమినైజేషన్ పై శిక్షణ ఇచ్చారు. కొత్తగా వచ్చిన యూవిన్ పోర్టల్ గురించి, వ్యాక్సిన్ నిలువల కోసం ఉపయోగించే ఈ-విన్ పోర్టల్ గురించి, వ్యాక్సిన్ ఇచ్చే ప్రదేశాలు ఎలా ఎంచుకోవడం ఒక మైక్రో ఆక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం ఎలానో వివరించారు.