వరంగల్ నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తప్పిపోయిన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇస్లామియా గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ సందర్శకు కాజీపేటకు చెందిన మహమ్మద్ బాషా, షబానాసుల్తానా దంపతులు, కూతురు సఫా పర్వీన్(2) ఆదివారం వచ్చారు. బాలిక సఫా పర్వీన్ తప్పిపోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 100 డయల్ సమాచారంతో పోలీసులు బాలికను రెండు గంటల్లో గుర్తించినట్లు సోమవారం తెలిపారు.