కమలపూర్ గ్రామ పరిధిలో సేకరించిన బియ్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచాడనే సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. కమలపూర్ మండలం పంగిడి పల్లికి చెందిన శ్రీకాంత్ సేకరించిన 42 క్వింటాళ్ల పిడీఎస్ బియ్యాన్ని ఒక అశోక్ లీలాండ్ వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పీఎస్ కు కేసు నమోదు కోసం అప్పగించినట్లు తెలిపారు. బియ్యం విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందన్నారు.