బంధన్ హాస్పిటల్ పై గత కొద్ది రోజులుగా బాధితుడు జర్నలిస్టు కృష్ణ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి సోమవారం హన్మకొండ ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి 3 నెలలు మంచానికి పరిమితం అయ్యారన్నారు.