బెట్టింగ్ యాప్ కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న దొంగను సీసీఎస్ మరియు కేయూసీ పోలీసులు సంయుక్తంగా కలిసి మంగళవారం అరెస్టు చేసారు. అతని దగ్గర నుండి పోలీసులు సుమారు 28 లక్షల 50వేల రూపాయల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాల ప్రకారం కొండపల్లి ధర్మరాజు(30) అనే వ్యక్తి బెట్టింగ్స్ కోసం అప్పు చేసి వాటిని తీర్చిడానికి దొంగ గా మారాడని తెలిపారు.