ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పేద విద్యార్థినికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అండగా నిలిచారు. ఆర్ధిక సాయం అందజేసి మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు. ధర్మసాగర్ మండలం దేవునూరుకు చెందిన పొడిశెట్టి ప్రతాప్ కుమార్తె పల్లవి భద్రాద్రి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. కాలేజీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని కాలేజీ ఫీజు అందజేశారు.