గీసుగొండ మండలంలోని ఆరేపల్లి గ్రామములో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి యస్డియఫ్ కింద మంజూరు చేసిన లక్ష అరవై వేల రూపాయల నిధులతో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బోర్ బావిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కమలాకర్, హనుమాన్ గుడి చైర్మన్ అల్లూరి రాజారాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.