పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 45 రోజులుగా నిత్యం కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రాంత రైతాంగం పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.