ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చెన్నరావుపేట మండల సంఘం పరిధిలోని కొత్త సభ్యులకు స్వల్ప కాలిక రుణాలను సోమవారం జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించారు. రైతులు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట సొసైటీ ఛైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.