ములుగు జిల్లా రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులుపోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.