ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద పుష్పగుచ్చమిచ్చి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా ఎస్పీ శభరీష్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సమావేశంలో పాల్గోన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు.