PDSU 50 వసంతాలు పూర్తిచేసుకున్నసందర్భంగా నవంబర్ 17వ తేదీన ములుగు జిల్లాలో నిర్వహించనున్న విద్యార్థి అమరవీరుల స్మరణ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్కకు పలువురు నేతలు గురువారం అందజేశారు. అనంతరం PDSU ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, తదితర వివరాలను మంత్రి సీతక్కకు నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతి గౌడ్ తదితరులు ఉన్నారు.