ములుగు జిల్లా వైద్యాధికారి జిల్లా టిబి నియంత్రణ అధికారుల అదేశానుసారం మంగపేట, చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో క్షయ అనుమానిత వారి నుండి తెమడను స్వీకరించడం జరిగింది. వాటిని ఏటూరునాగారంలో గల తృణాట్ లో పరీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారులు, పిహెచ్సి సూపర్ వైజర్, ఎస్టిఎస్, ఎస్టిఎల్ఎస్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.