ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలోని రాంనగర్ గ్రామంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను ఏటూరునాగారం తహశీల్దార్ జగదీశ్వర్ పరిశీలించారు. అనంతరం సర్వే కార్యక్రమంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రెడ్డి లక్ష్మీనారాయణ, టీచర్లు ప్రవీణ్, వీరబద్రం, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.