ములుగు జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముందు బైటాయించి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లాను ఎంచుకొని అంగన్వాడీ సెంటర్లో క్రచ్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రచ్ సెంటర్ల నిర్వహణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపొతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.