హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం విద్యార్థులు సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. హాస్టల్ మెస్ ఛార్జీలను రూ. 1,500 నుంచి రూ. 2,100కు ప్రభుత్వం పెంచడం పట్ల మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గండి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాస్మోటిక్ ఛార్జీ కూడా పెంచడం విద్యార్థులలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.