చలో కొడంగల్ పిలుపు నేపద్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు లంబాడీ సామాజిక వర్గానికి చెందిన సంఘాల ప్రముఖ నాయకులను సోమవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం లంబాడీల భూములు రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటే సహించేది లేదని, అరెస్టులతో ప్రజాఉద్యమాలను ఆపలేరని లంబాడీ హక్కుల సంఘాల నేతలు హెచ్చరించారు.