మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులు పడకుండా అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉందని ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.