కేసముద్రం: ఇంటికన్నె స్టేషన్ తండాలో సైకో వీరంగం

59பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె స్టేషన్ తండాలో శుక్రవారం సాయంత్రం ఓ సైకో వీరంగం సృష్టించాడు. తండాలోని ప్రధాన వీధిలో అర్థనగ్నంగా కత్తి చేతపట్టుకొని తిరుగుతూ తనను తాను పొడుచుకున్నాడు. అడ్డుకోబోయిన తండా వాసుల పై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. ఎలాగోలా కొందరు యువకులు ధైర్యం చేసి అతని పట్టుకొని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆ సైకో ఎవరన్నది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி