కలియుగ ప్రత్యక్ష ధైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఉండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారి సన్నిధిలో ప్రార్థించినట్లు తెలియజేశారు. అదే విధంగా హథీరాంజీ మఠంను అభివృద్ధి చేయాలని అన్నారు. టీటీడీ బోర్డులో బంజారాలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.