రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వంపై దుష్పచారం చేస్తున్న ప్రతిపక్షాలకు దీటైన జవాబు చెప్పాలని, గ్రామాల్లో కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.