జనగామ పట్టణంలోని బాణాపురంలో ఓ ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తామంటూ నమ్మించి 55 లక్షల రూపాయలు కాజేసిన ఓ హిజ్రా తో పాటు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల వద్ద నుండి 21.16 లక్షల రూపాయల విలువ గల 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన 2 ప్లాటు కొనుగోలు పేపర్లు, ఒక కారు స్వాదీనం చేసుకున్నారు.