జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓటింగ్ పోలీస్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదివారం పరిశీలించారు. మార్పులు, చేర్పుల దరఖాస్తులను, నూతన ఓటర్ల దరఖాస్తులను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరారు.