కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలోని దేవాదాయ భూములలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపి మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు స్వయంగా అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. మల్లన్న భూములు కబ్జాలకు గురవుతున్నాయని కొమురవెల్లి తహసిల్దార్ లక్ష్మీనారాయణ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.