దేశంలో దోపిడీ వ్యవస్థను రూపుమాపడమే సీపీఎం పార్టీ ఏకైక లక్ష్యమని సీపీఎం జనగాం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం దేవరుప్పుల మండలం సింగరాజు పల్లిలో సీపీఎం ఐదవ మండల మహాసభ రెడ్డి రాజుల నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు హాజరైన కనకారెడ్డి మాట్లాడుతూ దేశంలో పేదవాడి శ్రమదోపిడీ జరుగుతుందని, శ్రమకు తగ్గ ఫలితం దక్కేవరకు అసంఘటిత కార్మికులంతా సంఘటితంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు.