దేవరుప్పుల: మాయమాటలతో మైనర్ వెంట పడుతున్న యువకుడి రిమాండ్

77பார்த்தது
దేవరుప్పుల: మాయమాటలతో మైనర్ వెంట పడుతున్న యువకుడి రిమాండ్
మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వెంట పడుతున్న యువకుడిని పోలీసులు రిమాండ్ చేశారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం బోడబండతండాకు చెందిన ధరావత్ యాకుపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు దేవరుప్పుల పోలీసు స్టేషన్ లో నమోదైన కేసుపై పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి విచారణ జరిపి రిమాండ్ కు తరలించారు. ఎవరైన ఇలాంటి నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி