రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు, శనివారం పాలకుర్తి గూడూరు గ్రామాల్లో చేస్తున్న సర్వేను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు దొర్లకుండా ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించాలని, కులగణన సమగ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.