కురవి: అనాధాశ్రమంలో దీపావళి వేడుకలు
మహబూబాబాద్ జిల్లాలో అనాధ పిల్లల ఆశ్రమంలో గురువారం కురవి ఎస్సై సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఓ అనాథ పిల్లల ఆశ్రమంలో దీపావళి పండగ సందర్బంగా అనాథ పిల్లలకు స్వీట్లు, బట్టలు, బాణసంచా, పండ్లు, ఇతర సామాగ్రి అందజేసి వారితో పాటు సంబరాలు జరుపుకున్నారు. ఆశ్రమంలో వేడుకలు జరుపుకోవడంతో పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు.