డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో మంగళవారం మెడికల్ క్యాంప్ ని నిర్వహించారు. వైద్యాధికారి కనక దుర్గ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వారు తెలిపారు. 52 మంది ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి, రోగులకు మందులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్స్ రాణి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.