మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల సమీపంలో సోమవారం రాత్రి పోలీస్ వాహన తనిఖీల్లో నిషేధిత 8 క్వింటాళ్ల నల్లబెల్లం, 60కేజీల పటిక పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మరిపెడ పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో బెల్లం, పొగాకు, గుట్కా ఉత్పత్తులపై పోలీసులు వరసగా దాడులు నిర్వహిస్తూ భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అయిన వారి తీరు మారడం లేదు.