డోర్నకల్ మండలం ముల్కలపల్లి పల్లె ప్రకృతి వనంలో మంగళవారం రాత్రి కొండచిలువ పిల్ల హల్‌చల్ చేసింది. పల్లె ప్రకృతి వనం నుంచి కొండచిలువ పిల్ల ముల్కలపల్లి - తోడేళ్లగూడెం పోయే ప్రధాన రహదారి మీదకు వస్తుండగా వాహనదారులను చూసి మారలా వెనుతిరిగి పల్లె ప్రకృతి వనంలోకి చొరబడిందని స్థానిక వాహనదారులు తెలిపారు. ఆ కొండచిలువ పిల్ల 4 అడుగుల పొడవు ఉందని వారు అన్నారు.