భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వంలోని సంపూర్ణత అభ్యున్నత అభియాన్ కింద ఎంపికైన మహాముత్తరం మండలంకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. మారుమూల మండలాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని నెలల కిందట బ్లాకుల అభివృద్ధి కార్యక్రమం పథకం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.