గంజాయి, డ్రగ్స్, ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ప్రభుత్వ నిషేధిత అక్రమ వ్యాపారాల నియంత్రణే లక్ష్యంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు సమస్యలు తలెత్తితే, పోలీసులను ఆశ్రయించాలని అన్నారు.