కాళేశ్వరంలో ప్రయాణికులకు సరైన బస్సులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు యాత్రికలు తరలివచ్చి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణానికి బస్టాండ్ కి రాగా, మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి కాళేశ్వరంకు బస్సులు తగ్గించడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.