TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని అందరూ భావించినా.. ఆమె బయటికి రాలేదు. దీంతో ఆమె ఎంట్రీ ఎప్పుడా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత ఇంటికే పరిమితమయ్యారని, మళ్లీ ఎన్నికల నాటికి యాక్టివ్ అవుతారని తెలుస్తోంది.