కొడంగల్: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి: తహశీల్దార్

68பார்த்தது
కొడంగల్: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి: తహశీల్దార్
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అర్హులైన పేదలకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు సమయపాలన పాటించాలని కొడంగల్ తహశీల్దార్ బి. విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రేషన్ డీలర్లతో సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం అందిస్తోందని, డీలర్లు సమయపాలనలో ప్రతీ నెల 1 నుంచి 17 వరకు ఉదయం 7 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 8 వరకు పంపిణీ చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி